- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gutta Sukhender Reddy : నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే..మరి కేసీఆర్ కు ఓట్లు ఎందుకు వేయలేదు?: గుత్తా
మాజీ సీఎం కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే..తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది నిజమేనని..4కోట్ల ప్రజల హీరో అయితే మరి ఆ ప్రజలు ఆయనకు ఓట్లు ఎందుకు వేయలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిGutta Sukhender Reddy ప్రశ్నించారు

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే..తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది నిజమేనని..4కోట్ల ప్రజల హీరో అయితే మరి ఆ ప్రజలు ఆయనకు ఓట్లు ఎందుకు వేయలేదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిGutta Sukhender Reddy ప్రశ్నించారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 100 శాతం పర్ఫెక్ట్ కులగణన సర్వే చేసిందన్నారు.
అసలు కులగణన ముందు బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉందని..దేశంలోనే బీసీ కులగణన చేసింది ఇది మొదటిసారి కదా అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆఫీషియల్ గారికార్డు లేదని..అసెంబ్లీ లో పెడితే రికార్డులో ఉండేదన్నారు. అయినా ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడని..కులం, మతంతో సంబంధం ఉండదన్నారు. కులం, మతం గురించి ప్రశ్నించుకోవడం మంచిది కాదన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42% అసెంబ్లీ లో పెట్టి పాస్ చేయించి పార్లమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని తెలిపారు. బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికీ తెలిసిందేనన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఉచితాలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందేనని..రాష్ట్ర బడ్జెట్ బట్టి పధకాలు ఉండాల్సిన అవరసముందన్నారు. ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ వాళ్లు చెప్పడం వారు అధికారం కోల్పోయిన ఆవేధనలో చేస్తున్న వ్యాఖ్యలేనన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా పర్వాలేదని..జనానికి నచ్చకపోతే..రాజ్యంగం మేరకు పరిస్థితులను అనుసరించి ఎన్నికలొస్తాయే తప్పా ఎవరో కోరుకుంటే ఎన్నికలు రావన్నారు. సరైన ధర, కరెంటు ఇవ్వకపోతే ప్రజలు, రైతులే రోడ్డు పైకి వస్తారన్నారు. అప్పుడు మనం వెళ్ళి ఆ గుంపులో కూర్చోవాల్సిందేనని గుత్తా స్పష్టం చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే పార్టీలపై, ప్రభుత్వంపై, అభ్యర్థులపై భారం తగ్గుతుందన్నారు.






