కాంగ్రెస్ మళ్లీ పవర్‌లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ మళ్లీ పవర్‌లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ కరీంనగర్‌ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఫైర్ అయ్యారు. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మొహం చాటేశారని ఆరోపించారు. పింఛన్లను పెంచుతామని చెప్పి నమ్మించి నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తులం బంగారం, స్కూటీలు ఎక్కడ రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ ప్రశ్నించారు.

గజినీ మూవీ గుర్తుకొస్తుంది..

అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. గ్రామ పంచాయతీయలకు నయా పైసా ఇవ్వని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని బండి సంజయ్ అన్నారు. దొంగ ఓట్లపై మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లు.. జగిత్యాల ‘(Jagityal)లో సీట్ల చోరీ గురించి మాట్లాడాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పదవి నుంచి దిగిపోయినప్పుడు ఇదే మహేశ్ కుమార్ గౌడ్ ఓ బీసీగా స్పందించానని అన్నాడని.. నేడు అదే వ్యక్తి తాను బీసీ కాదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పీసీసీ చీఫ్‌ను చూస్తే తనకు గజినీ మూవీ గుర్తుకొస్తుందని సెటైర్లు వేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని మహేశ్ కుమార్ గౌడ్, దొంగ ఓట్లు అంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను అవమానించారని కామెంట్ చేశారు. అదేవిధంగా 8 నియోజవర్గ ప్రజలకు కూడా క్షమపణలు చెప్పాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఇక కరీంనగర్‌లో ఒక్కో మైనారిటీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వమంటే.. ముస్లింకు రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఉప రాష్ట్రపతిగా ఓ బీసీని నిలబెడితే.. ఒడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని అన్నారు. ఓడిపోయే దగ్గర రెడ్డిని నిలబెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలిస్తే.. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఓటు చోరీ చేసినట్లైతే తెలంగాణలోనూ మేమే అధికారంలో రావాలి కాదా.. అని బండి సంజయ్ కామెంట్ చేశారు.

టోపీలు పెట్టుకుని కాంగ్రెస్ నేతల డ్రామాలు

ఎన్నికలు ఉన్నా.. లేకపోయినా హిందూ ధర్మం కోసం నిలబడతామని బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం కోసం బీజేపీ (BJP) పోరాటం చేస్తోందని తెలిపారు. భైంసాలో పేద హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. మాది దేవుళ్ల పార్టీ.. మీది బిచ్చపు బతుకు అంటూ ఫైర్ అయ్యారు. హిందువుల పండుగలకు గుళ్లలో సౌండ్ పెట్టొద్దని చెప్పడం దుర్మార్గమని అన్నారు. యూపీఏ హయాంలోనే దేశంలోకి పెద్ద ఎత్తున రోహింగ్యాలు వచ్చారని, టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది కాంగ్రెస్ నేతలు కాదా అని బండి సంజయ్ మండిపడ్డారు.

Next Story