- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Reservations: రెడ్లను తిడితే వదిలేది లేదు.. ఈబీసీ జేఏసీ హెచ్చరిక
బీసీ రిజర్వేషన్ల విషయంలో అగ్రకులాలను విమర్శించడం సరికాదని ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంతకాలంగా కొన్ని కులాలను రిప్రజెంట్ చేస్తున్నామని వారి అభివృద్ధికి పని చేస్తున్నామని చెప్పుకునే కొంతమంది మీడియా, బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చిన విధంగా ఫార్వర్డ్ కులాలను, లీడర్లపై దిగజారి దూషిస్తున్నారని ఇకపై అలాంటి వ్యాఖ్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (EBC JAC) డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఫార్డ్ క్యాస్ట్ ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈబీసీ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానాలపై కార్యాచరణపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఆరు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు:
అగ్రకులాలను కులాలను దూషిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం పట్ల కఠినంగా వ్యవహరించినాలని తీర్మానం చేశారు. అలాగే ఫార్వర్డ్ కులాలు (Forward Castes) రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే అసత్య ప్రచారాన్ని ఖండించాలని నిర్ణయించారు. ఫార్వర్డ్ కులాలు అంతా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని, వాళ్లను రాజకీయ బహిష్కరణ చేయాలని అపవాదులు వేస్తున్నారని ఇలాంటి వాటిని తిప్పికొట్టాలని తీర్మానించారు. ఏ వర్గానికి నష్టం జరగకుండా భారత రాజ్యాంగానికి, న్యాయస్థానాల తీర్పులకు లోబడి రిజర్వేషన్లు కల్పించాలనేదే ఫార్వర్డ్ కులాల భావన అని తీర్మానించారు. ఇతర కులాలు అన్ని సందర్భాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‍ని విమర్శించడం, వ్యతిరేకించడం, ఈడబ్ల్యూఎస్ కు బీసీ రిజర్వేషన్లకు ముడి పెట్టడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. ఫార్వర్డ్ కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ కించపరిస్తూ మాట్లాడే ఎవరి మీదనైనా యాక్షన్ తీసుకోవడానికి వీలుగా, ఆర్థికంగా మనలో వెనుకబడిన వారికి చేయూత ఇవ్వడానికి ఈబీసీ కమిషన్, ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ డిపార్ట్మెంట్, ఈబీసీ మినిస్ట్రీ, ఈబీసీ స్టడీ సర్కిల్స్, ఈబీసీ హస్టల్స్ వంటి స్టాట్యూటరీ ఇన్ స్టిట్యూషన్స్ అవసరంపై తీర్మానం చేశారు. ఫార్వర్డ్ కులాల పేదలకు న్యాయం జరిగే విధంగా తక్షణ నిర్ణయాలు చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ గవర్నర్, సీఎం, డీజీపీతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రతినిధి బృందం ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వాలని తీర్మానించారు. ఫార్వర్డ్ కమ్యూనిటీ ఆత్మగౌరవ పరిరక్షణకు ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు.
ఒకరిని మించి మరొకరు కులాల జపం:
ఈ సమావేశంలో ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రకులాల్లో పేదలు ఉన్నారని మాలో పేదరికానికి కారణం అగ్రకులాల పాలకులేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయవి వీరికి రిజర్వేషన్లు వద్దనేది మా వాదన కాదని కానీ అగ్రవర్ణాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. అగ్రవర్ణాల్లోని అనేక మంది పేదలు ఉన్నారని వీరికి కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలకు ఉంది. కానీ వీరిని విస్మరించి నిరాధారణకు గురి చేస్తున్నారన్నారు. ఈ దుస్థితికి అగ్రకులాల్లోని ప్రజాప్రతినిధులు నాయకులే కారణం అన్నారు. అగ్రకులాల వారు ఎంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నా అగ్రవర్ణాల్లోని పేదలకు చేసిందేమి లేదన్నారు. త్రిబుల్ టెస్టుకు లోబడి రిజర్వేషన్లు పెంచుకున్నా తమకు అభ్యంతరం లేదని అంతే తప్ప రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు కులాల జపం చేయడం సరికాదన్నారు.






