- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో టేకోవర్ కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఐడీబీఐ
హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మెట్రో టేకోవర్ కోసం ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్ ను నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్ గా ఐడీబీఐని ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన నివేదికను ఐడీబీఐ రూపొందించడం తో పాటు ప్రభుత్వం అందజేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఫైనాన్స్, లీగల్ అంశాల్లో ఏలాంటి ఇబ్బందుల్లేకుండా చేయడానికి ఐడీబీఐ సంస్థను నియమించారు. ఎల్ అండ్ టీ సంస్థను ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర అంశాలకు సంబంధించిన రిపోర్టు రూపొందించడం తో పాటు ప్రభుత్వానికి అందజేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీని ఆధారంగానే హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సంస్థలు చర్చించుకుని ఒప్పందాలపై సంతకాలు చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
టెక్నికల్ కన్సల్టెంట్…
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిగా టెక్నికల్ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎంతో మంది నిపుణులు పనిచేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్స్ వంటి వాటికి సంబంధించిన రిపోర్టు తయారు చేయడానికి ఓ కన్సల్టెంట్ ను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో రోజుల్లో కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్, టెక్నికల్ కన్సల్టెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్చి 31లోగా మెట్రో రైలు ప్రాజెక్టు టేకోవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






