Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మరోసారి ఎమోషనల్‌

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-24 16:13:34  IST  )

సంధ్య థియేటర్‌(Sandhya Theater) ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) మరోసారి ఎమోషనల్‌ అయ్యారు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మరోసారి ఎమోషనల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్‌(Sandhya Theater) ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) మరోసారి ఎమోషనల్‌ అయ్యారు. పోలీసులు చూపించిన వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ విచారణకు పిలిస్తే.. ఎప్పుడైనా హాజరు అవుతానని చెప్పారు. ఇదిలా ఉండగా.. బాలుడు శ్రీతేజ్(Sri Tej) తండ్రి భాస్కర్‌(Bhaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం కిమ్స్‌ ఆసుపత్రి(Kims Hospital) వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయి. ఇంజక్షన్‌ ఇస్తే చెయ్యి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడు. రెండ్రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడు.. కానీ, మమ్మల్ని గుర్తు పట్టడం లేదు. మీరు పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తు పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు బాలుడు పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

Read More...

Allu Arjun: పుష్ప రాజ్ చుట్టూ తిరుగుతున్న 11:11.. అంటే అల్లు అర్జున్ ను యూనివర్స్ ముందే హెచ్చరించిందా?


Next Story