జెప్టోలో తాటిముంజలు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Ajay Maddhiboyina |

రోడ్డు ప‌క్క‌నే కాదు ఇప్పుడు ఏకంగా జెప్టోలోనూ తాటిముంజ‌లు అమ్ముతున్నారు. వీటి ధ‌ర తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. గ్రామాల్లో ఫ్రీగా ఇచ్చే ఈ తాటిముంజ‌ల‌ను జెప్టోలో పావుకేజీ 94 రూపాయ‌ల‌కు అమ్మేస్తున్నారు.

జెప్టోలో తాటిముంజలు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే గ్రామాల్లో ఎక్కడ చూసినా తాటిముంజలే కనిపిస్తాయి. ఊరి చివర, పొలాల్లో ఉండే తాటిచెట్లకు వేలాడుతూ నోరూరిస్తాయి. గౌడన్నలు చెట్లెక్కి ఎవ‌రికి కావాలంటే వాళ్ల‌కు ఉచితంగానే ఇచ్చేవాళ్లు. కొంత‌మంది న‌గ‌రాల‌కు త‌ర‌లించేవాళ్లు. దీంతో సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు సిటీలో రోడ్ల పక్క‌న తాటిముంజ‌లే క‌నిపిస్తుంటాయి. తిన‌డానికి టేస్టీగా ఉండ‌టంతో పాటు శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని చెప్ప‌డంతో వీటికి ఫుల్ గిరాకీ ఉంటుంది. అయితే అలాంటి తాటి ముంజ‌ల ధ‌ర‌లు ఇప్పుడు కొండెక్కాయి. రోడ్డు ప‌క్క‌నే కాదు ఇప్పుడు ఏకంగా జెప్టోలోనూ తాటిముంజ‌లు అమ్ముతున్నారు. వీటి ధ‌ర తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. గ్రామాల్లో ఫ్రీగా ఇచ్చే ఈ తాటిముంజ‌ల‌ను జెప్టోలో పావుకేజీ 94 రూపాయ‌ల‌కు అమ్మేస్తున్నారు. అంటే కేజీ ముంజ‌కాయ‌లు 376 రూపాయ‌లు. ఇలా చూస్తే యాపిల్స్ కంటే ఐస్ యాపిల్స్ తాటిముంజలే ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్నారు. యాపిల్స్ ఎప్పుడైనా దొరుకుతాయి వీటికి పెద్ద‌గా సీజ‌న్ లేదు. కానీ ఐస్ యాపిల్ తినాలంటే ఇదే సీజ‌న్ కాబ‌ట్టి జ‌నాలు కూడా ఎగ‌బ‌డి కొంటున్నారు.

తాటిముంజల్లో ఉండే పోషకాలు: ఎండాకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. తాటిముంజల్లో విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్ ముఖ్యంగా బయెటిన్ ఉంటుంది. విటమిన్ సీ కూడా పుష్పలంగా ఉంటుంది. అదే విధంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపడతాయి. ఇందులో కొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి ఇవి చాలా మంది ఆహారం.

Next Story