TG: రాష్ట్రంలో షాకింగ్.. మరో కౌన్సిలర్ మిస్సింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-16 17:18:51  IST  )

మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నిక వేళ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి అదృశ్యమయ్యారు.

TG: రాష్ట్రంలో షాకింగ్.. మరో కౌన్సిలర్ మిస్సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ చైర్ పర్సన్ల ఎన్నిక వేళ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy Dist) ఇబ్రహీంపట్నం కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి(Ibrahimpatnam Councilor Akula Yadagiri) అదృశ్యమయ్యారు. ఈ మేరకు ఆయన భార్య వసంత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్నారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ భార్య వసంత ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అంతకుముందు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ క్యాంపులో ఉన్న 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మున్సిపల్ కార్యాలయానికి రాకపోవడంతో, ఆయన వచ్చాకే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పలుమార్లు వాగ్వాదానికి దిగారని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సృష్టించిన గందరగోళం వల్ల రెండుసార్లు వాయిదా వేసినా ఫలితం లేకపోవడంతో ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేసినట్లు చెప్పారు.

Next Story