- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ibomma Ravi: హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి.. ఎందుకంటే?
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి, తాజాగా బెయిల్ కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించాడు. సినీ పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమకు భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు రవిపై గతంలో ఐదు కేసులు నమోదు అవ్వడంతో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ పైరసీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి, తాజాగా బెయిల్ కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించాడు. సినీ పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమకు భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు రవిపై గతంలో ఐదు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ కోసం అతడు నాంపల్లి కోర్టులో పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం వాటిని వరుసగా కొట్టివేసింది. దీంతో రవి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిందితుడికి బెయిల్ ఇచ్చే అంశంపై తమ వెర్షన్ వినిపించాలని పోలీసులను ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేయడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం నాడు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవికి, హైకోర్టులోనైనా ఊరట లభిస్తుందా లేదా అనేది పోలీసుల కౌంటర్ దాఖలు అనంతరం తేలనుంది.






