- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంక్ పోర్టల్‌లో IBOMMA సినిమాలు.. విచారణకు హాజరైన టెక్నికల్ టీమ్
IBOMMA రవి కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా బ్యాంక్ టెక్నికల్ టీంను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. బ్యాంక్ లైఫ్ ఇన్య్సూరెన్స్ పోర్టల్‌కు ఐబొమ్మను లింక్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: IBOMMA రవి కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఓ బ్యాంక్ టెక్నికల్ టీంను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. బ్యాంక్ లైఫ్ ఇన్య్సూరెన్స్ పోర్టల్‌కు ఐబొమ్మను లింక్ చేశారు. దీంతో ఐబొమ్మకు సంబంధించిన బప్పమ్ టీవీలో లింక్ కాపీ చేసి ఆ పోర్టల్‌లో పేస్ట్ చేస్తూ సినిమాలు చూస్తున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ టెక్నికల్ టీమ్ నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐబొమ్మ లింక్ తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే పైరసీ సినిమాల వెబ్ సైట్ ను బ్యాంక్ పోర్టల్ లోనే లింక్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా బ్యాంకు వెబ్ సైట్ నే హ్యాక్ చేసి దానికి లింక్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రవి పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే ఇలా జరగటంతో రవి వెనక ఎవరెవరున్నారు. ఐబొమ్మను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐబొమ్మ వన్ అంటూ ఇతర పేర్లతోనూ కొత్త వెబ్ సైట్లు దర్శనం ఇస్తున్నాయి.
Read More.






