IBOMMA రవికి మరో షాక్.. ఇక బయటకు రాలేడా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-12 15:09:52  IST  )

పైర‌సీ సినిమాల వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ర‌విని పోలీసులు ఇటీవ‌ల అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ర‌వి పోలీసుల క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే ఇప్ప‌టికే ర‌విపై 10 సెక్ష‌న్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఇక బయటకు రాలేడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

IBOMMA రవికి మరో షాక్.. ఇక బయటకు రాలేడా?
X

దిశ, వెబ్ డెస్క్: పైర‌సీ సినిమాల వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ర‌విని పోలీసులు ఇటీవ‌ల అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ర‌వి పోలీసుల క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే ఇప్ప‌టికే ర‌విపై 10 సెక్ష‌న్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో IT యాక్ట్ , BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్ , ఫారినర్స్ యాక్ట్ స‌హా ప‌లు సెక్ష‌న్లు ఉన్నాయి. ఇక తాజాగా ఫోర్జరీ సెక్షన్ ను సైతం పోలీసులు జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద ర‌వి పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, RC తీసుకున్నాడు. దీంతో అత‌డిపై ఫోర్జ‌రీ సెక్ష‌న్స్ సైతం జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు.

ఇక ప్ర‌స్తుతం పోలీసులు ర‌విని విచారిస్తుండ‌గా ప‌లు కీల‌క విష‌యాల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌వికి సంబంధించిన క్రిప్టో వ్యాలెట్స్ వివ‌రాలు, విదేశీ భాగ‌స్వాముల వివ‌రాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ర‌వి గ‌తంలో పోలీసుల‌కే స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను ప‌ట్టుకోలేర‌ని, ప్ర‌భుత్వ వెబ్ సైట్ల‌ను సైతం హ్యాక్ చేస్తాన‌ని స‌వాల్ చేశాడు. కానీ చివ‌రికి హైద‌రాబాద్ లోనే అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు పోలీసులు అనేక సెక్ష‌న్ల కింద కేసులు బుక్ చేయ‌డంతో ర‌వి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలే క‌నిపించ‌డంలేదు.

Read More..

షాకింగ్.. IBOMMA మళ్లీ వచ్చేసింది!

Next Story