ACB: ముగిసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ

by Prasad Jukanti |

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది.

ACB: ముగిసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో (Formula E car race case) ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Arvind Kumar) ఏసీబీ విచారణ ముగిసింది. ఏ2 గా ఉన్న ఆయన్ను ఏసీబీ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ1 కేటీఆర్, ఏ3 బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల మళ్లింపు విషయంలో ఆర్థిక శాఖ అనుమతి, ఎన్నికల నిబంధనలు పాటించకపోవడంపై ఆరా తీసినట్లు సమాచారం. అయితే నిధుల మళ్లింపులో నా ప్రమేయం లేదని బిజినెస్ రూల్స్, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని కేటీఆర్ కు చెప్పానని అయినా ఎఫ్ఈవో కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఏసీబీ (ACB) అధికారులకు అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను తిరిగి పంపిచేశారు. తర్వాత ఎవరిని ప్రశ్నించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

Next Story