- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నుంచి సెక్రటేరియట్ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఆ దారి నుండే రాకపోకలు
తెలంగాణ సెక్రటేరియట్ లోకి ఐఏఎస్ , ఐపీఎస్ ఉన్నతాధికారుల రాకపోకల విషయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియట్ లోకి ఐఏఎస్ , ఐపీఎస్ ఉన్నతాధికారుల రాకపోకల విషయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సచివాలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రధాన ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వగా.. ఇక నుంచి అధికారులు అందులో కొన్ని మార్పులు చేశాయి. ఇప్పటినుండి సీఎం కాన్వాయ్ వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లేటట్టు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రధాన గేటును మూసివేశారు. అంతేగాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రాకపోకల అంశంలో కూడా పలు మార్పులు చేసినట్లు సచివాలయ అధికారులు తెలిపారు.
ఇకనుండి ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా రాకపోకలు సాగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ ఎంట్రీ ఎక్జిట్ లపై మార్పులు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మాత్రమే ఆరో అంతస్థు నుంచి తొమ్మిదో అంతస్థుకు మార్చాలని అధికారులు నిర్ణయించగా.. ప్రస్తుతం తొమ్మిదో అంతస్థులో దానికి సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.






