- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీకు మరీ మరీ చెబుతున్నా..’ పోలింగ్ వేళ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్తు మన భాధ్యత.. ఓటు వేయడం పై నిర్లక్ష్యం వద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ట్వీట్ చేసిన ఆయన.. ప్రజాస్వామ్య రక్షణలో మీ పాత్ర పోషించాలి. యువతకు మరీ మరీ చెబుతున్నా మీ ఓటు హక్కు తప్పక వినియోగించుకోండి అని సూచించారు. భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటానికి ఓటే పునాది అని, ప్రజల హక్కుల పరిరక్షణ ఓటుతోనే సాధ్యం అన్నారు. ఓటు మన హక్కు మాత్రమే కాదని బాధ్యత కూడా అని గుర్తు చేశారు. మన బాధ్యత నిర్వర్తించినప్పుడే హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు.
Next Story






