- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని రేసులో ఉంటా.. మరోసారి మనసులో మాట చెప్పేసిన KCR
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని రేసులో ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని రేసులో ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటా అన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అన్నారు. మా పాలన విధ్వంసం అంటే వాళ్ల కంటే మూర్ఖులు లేరన్నారు. ప్రభుత్వం దగ్గర సూట్ కేసులో డబ్బులు ఉండవని.. ప్రతిరోజూ డబ్బులు జెనరేట్ అవుతాయన్నారు.
బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు దొబ్బిపోయే పార్టీ అన్నారు. ముస్లింలపై ద్వేషంతో రిజర్వేషన్లు తీసేస్తామ్ అంటే కుదరదన్నారు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. మాకు నివేదికలు ఇస్తారు అంతే అన్నారు. వాళ్లు ఎలా నివేదికలు ఇస్తారో సీఎంకు అవసరం లేదని.. గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వాలు ఉండవని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. రోజూ సీఎంకు మార్నింగ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుందన్నారు. ప్యారగాన్ చెప్పులు వేసుకున్నది, కబ్జాలు చేసింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.






