- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తా.. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్
by Kema Shiva Kumar |
కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యుల ఎదుట మంత్రిగా ప్రమాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరికీ తానేంటో తెలుసని.. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని కామెంట్ చేశారు. ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పని చేస్తానని.. తనకు ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఎవరో చేసిన కామెంట్స్‌కు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు మంత్రి అజారుద్దీన్ నిరాకరించారు.
Next Story






