ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటా! కానీ 11 కండిషన్స్ ఒప్పుకోవాల్సిందే! యువతి డిమాండ్స్ చూసి నెటిజన్లు షాక్

by Ramesh Naini |

ఈ రోజుల్లో సరైన సంబంధం దొరికి పెళ్లి కావడం అంటేనే యువతకు పెద్ద టాస్క్‌లా మారిపోయింది.

ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటా! కానీ 11 కండిషన్స్ ఒప్పుకోవాల్సిందే! యువతి డిమాండ్స్ చూసి నెటిజన్లు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో సరైన సంబంధం దొరికి పెళ్లి కావడం అంటేనే యువతకు పెద్ద టాస్క్‌లా మారిపోయింది. తమకు కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని యువకులు, యువతులు కొన్ని అంచనాలు పెట్టుకోవడం సహజమే. కానీ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక యువతి పెళ్లి కోసం వరుడికి పెట్టిన రూల్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆమె డిమాండ్ల లిస్ట్ చూసి ‘ఇలాంటి వాడు భూమ్మీద దొరకడు.. వేరే గ్రహం మీద వెతుక్కోవాల్సిందే’ అని సెటైర్లు వేస్తున్నారు.

వైరల్ అవుతున్న ట్వీట్..

ఎక్స్ (ట్విట్టర్)లో (Vedhika) ‘వేదిక’ (@Crustology_) అనే యూజర్ తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి ఒక పోస్ట్ పెట్టింది. ‘నేను ఇలాంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఏకంగా 11 కండిషన్స్ ఉన్న ఒక జాబితాను షేర్ చేసింది.

యువతి పెట్టిన 11 షరతులు ఇవే..

*వర్జిన్ అయి ఉండాలి.

*నెలకు కనీసం రూ.2 లక్షలు సంపాదించాలి.

*సహజంగానే అందంగా (Handsome) ఉండాలి.

*సరిగ్గా 6 అడుగుల (6'0") ఎత్తు ఉండాలి.

*వంట చేయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

*మహిళలను గౌరవించేవాడై ఉండాలి (Non-misogynist).

*సోషల్ మీడియా అస్సలు వాడకూడదు.

*అతనికి ఎలాంటి మహిళా స్నేహితులు (Female friends) ఉండకూడదు.

*ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా నా పర్మిషన్ అడగాలి.

*రోజుకు 24 గంటల పాటు తన లైవ్ లోకేషన్ నాకు షేర్ చేస్తూనే ఉండాలి.

*నన్ను ఫారిన్ ట్రిప్పులకు తీసుకువెళ్లాలి.

‘ఇలాంటి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు?’

ఈ షరతులన్నీ విధించిన ఆ యువతి, చివర్లో ‘ఇలాంటి అబ్బాయి నాకు ఎక్కడ దొరుకుతాడు?’ అంటూ అమాయకంగా ఒక ప్రశ్న కూడా వేసింది. జూలై 1, 2026న పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌కు క్షణాల్లోనే వేలాది వ్యూస్ (75.3K Views), లైక్స్, రిట్వీట్లు వస్తున్నాయి. యువతి పెట్టిన షరతులు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకూడదు అంటున్నావు.. మరి నీ పోస్ట్ ఆ అబ్బాయికి ఎలా రీచ్ అవుతుంది?’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘నువ్వు అడిగిన క్వాలిటీస్ ఉన్నవాడు మనిషి అయి ఉండడు, ఎందుకంటే అలాంటి వ్యక్తులు దొరకడం కష్టం అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Next Story