- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా.. ఎమ్మెల్యే సంజయ్ షాకింగ్ కామెంట్స్
by Kema Shiva Kumar |
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యే క్రాస్ బ్రీడా.. హైబ్రీడా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) కౌంటర్ ఇచ్చారు. నేడు ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరో ప్రజలకు తెలియదా.. అని ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లాకు ఎవరు ఏం చేశారో లెక్కలు తీద్దామని సవాల్ విసిరారు. అభివృద్ధి కోసం తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ జగిత్యాల నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం మీరు బీఆర్ఎస్‌లో ఉన్నారా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా..? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఆ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా సమాధానం ఇచ్చారు.
Next Story






