ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వినూత్న ఆలోచన వేదిక.. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఐ స్పార్క్ ఇన్నోవేషన్ హబ్

by Ramesh Naini |   (  Updated:2025-10-16 16:46:11  IST  )

ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు, విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వినూత్న ఆలోచన వేదిక.. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో ఐ స్పార్క్ ఇన్నోవేషన్ హబ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా కొన్ని (government school) ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు, విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నారు. కార్పొరేట్ సంస్థల నుండి అందే సీఎస్ఆర్ ఫండ్‌ను వినియోగించుకుని గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థుల మేథో సంపత్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), నిర్మాణ్ ఆర్గనైజేషన్ చొరవతో కార్పొరేట్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) కింద ఐ స్పార్క్ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వినూత్న కార్యక్రమం ప్రభుత్వ విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి, రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి నూతన నమూనాలను అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తుంది. వాతావరణ అంచనా, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి బాహ్య ప్రపంచ సవాళ్లను వినూత్న నమూనాల ద్వారా సృజనాత్మకంగా పరిష్కరించడానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను శక్తివంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న వయస్సు నుండే సమస్యల పరిష్కారం, వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహిస్తూ, పేటెంట్లను పొందేందుకు విద్యార్థులను ప్రోత్సహించనున్నారు.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అభినందన:

ఈ సందర్భంగా, రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేక అధికారి ప్రయత్నాలను అభినందిస్తూ, యాదాద్రి భువనగిరి కేజీబీవీ ప్రత్యేక అధికారిణి ఎన్. చంద్రకళ ను హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో సన్మానించారు.

Next Story