- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకో’.. CM రేవంత్‌కు హరీశ్‌రావు ట్వీట్
పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండని తెలిపారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడన్నారు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో అడ్డగోలుగా వాగిండని పేర్కొన్నారు. నాకు, కేటీఆర్‌కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బీఆర్ఎస్‌ను బలహీన పరచాలని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నడు రేవంత్ రెడ్డి.. అని తెలిపారు.
కానీ రేవంత్ రెడ్డి.. నీ చీప్ ట్రిక్కులకు, చిల్లర రాజకీయాలకు ఎవడు పడిపోడు.. నీ కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు.. అని విమర్శించారు. అనేక సార్లు చెప్పినా, మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి.. ఎప్పటికైనా హరీశ్ రావు గుండెల్లో ఉండేది కేసీఆరే.. హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే.. అని అసలు విషయం చెప్పారు. నీ దాష్టీకాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా నేనూ, కేటీఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతామని ఆయన అన్నారు.
నీ అవినీతిని ఎండగడుతాం.. అసమర్థతను నిలదీస్తాం.. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నిన్ను, నీ కాంగ్రెస్ ను గద్దె దించుతాం.. అని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ‘నా లక్ష్యమైనా, కేటీఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే. బీఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం.. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం. నీ చిల్లర వేషాలు, చెత్త రాజకీయాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నరు, బుద్ధి తెచ్చుకో.. మిగిలిన కొద్ది కాలమైనా సరిగ్గా వినియోగించుకో.. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు.. ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయి. లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతవు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






