- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Danam: అంతా తూచ్.. నేను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదు.. ట్విస్ట్ ఇచ్చిన దానం
పార్టీ ఫిరాయింపుల అంశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి ఆసక్తిగా మారింది. ఈ విషయంలో పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే దానం నాగేందర్ ట్విస్ట్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పీకర్‍కు తెలిపారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా అఫిడవిట్ సమర్పించిన ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ కు దానం విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అలా భావిస్తే ఎలా?:
బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదని నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లాను. అది వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ భేటీకి హాజరయ్యానని పేర్కొన్నారు. మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని, గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ ను కోరారు. కాగా దానం వాదనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జరగబోయే పరిణామాలపై బీఆర్ఎస్ ఎలా స్పందించబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.






