వాడిది వాళ్ల అమ్మలాంటి క్రిమినల్ బ్రెయిన్.. మా వంశంలో అలాంటి వాళ్లే లేరు.. ఐబొమ్మ రవి తండ్రి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-17 08:58:34  IST  )

ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పై ఆయన తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్లు చేశాడు. తనకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు కూడా లేవని అన్నారు. తన కుమారుడికి కూడా అలాంటి అలవాట్లు లేవని చెప్పారు.

వాడిది వాళ్ల అమ్మలాంటి క్రిమినల్ బ్రెయిన్.. మా వంశంలో అలాంటి వాళ్లే లేరు.. ఐబొమ్మ రవి తండ్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పై ఆయన తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్లు చేశాడు. తనకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు కూడా లేవని అన్నారు. తన కుమారుడికి కూడా అలాంటి అలవాట్లు లేవని చెప్పారు. కానీ వాడికి వాళ్ల అమ్మలాంటి క్రిమినల్ బ్రెయిన్ వచ్చినట్టు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వంశంలో అలాంటి ఖిలాడీలు లేరని చెప్పారు. వాళ్ల అమ్మ బ్రెయిన్ మంచిది కాదని అన్నీ వ్యతిరేకమైన పనులు చేస్తుందని చెప్పారు. డ్యూటీకి వెళ్ల‌కుండా డోర్ వేసేద‌ని ఆరోపించారు.

అందుకే ఆమెతో విడిపోయానని అన్నారు. తమ పని తాము చూసుకునేవాళ్లం అని కానీ ఇప్పుడు తన కుమారుడు చేసిన పనికి రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. త‌న కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ‌ని ఎందుకు విడిపోయారో అర్థం కాలేద‌న్నారు. త‌న కుటుంబంలో స‌మ‌స్య‌లు వ‌చ్చి విడిపోయామ‌ని వాటి వ‌ల్ల త‌న కుమారుడు కూడా ఇబ్బంది ప‌డ్డాడ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలోనే ఇంటి నుండి హైద‌రాబాద్ వెళ్లిపోయాడ‌న్నారు. త‌న‌ను ఎప్పుడూ డ‌బ్బులు అడ‌గ‌లేదని, త‌న‌కు ఇవ్వ‌లేదన్నారు. ర‌వి ఇంటి నుండి వెళ్లిపోయి 15ఏళ్లు అయ్యింద‌ని చెప్పాడు. త‌న కుమారుడు చేసిన ప‌నిని తాను కూడా ఖండిస్తున్నాన‌ని అన్నారు.

Read More... ఐబొమ్మ రవిని పొగిడిన నటుడు శివాజీ.. దుమారం రేపుతున్న కామెంట్స్! (వీడియో)

Nagarjuna: మా ఫ్యామిలీలో డిజిటల్ అరెస్టు.. స్వయంగా వెల్లడించిన నాగార్జున

Next Story