- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nagarjuna: మా ఫ్యామిలీలో డిజిటల్ అరెస్టు.. స్వయంగా వెల్లడించిన నాగార్జున
డిజిటల్ అరెస్టులపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ అరెస్టులపై టాలీవుడ్ ప్రముఖ యాక్టర్, అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలోనూ ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడ్డారని వెల్లడించారు. సుమారు రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్టు రూపంలో నిర్భందించారని అయితే ఈ విషయంలో పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే వారు తప్పించుకున్నారని తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సినీరంగ ప్రముఖులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున్న పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తు్న కృషి అభినందనీయమని అన్నారు.
ఐ బొమ్మ రవి వెనుక ఇంటర్నేషనల్ రాకెట్ ఉందని, పైరసీ వెబ్ సైట్లతో పెద్ద ప్రమాదం ఉందని నాగార్జున అన్నారు. జనాలను ట్రాప్ చేయడమే ఈ పైరసీ వెబ్ సైట్ల లక్ష్యం అని చెప్పారు. ఉచితంగా సినిమాలు చూపించాలనేది వారి ఉద్దేశం కాదని చెప్పారు. 50 లక్షల మంది సబ్ క్రైబర్ల డేటా ఐబొమ్మ నిర్వహాకుడు వద్ద ఉందని కేవలం రూ. 20 కోట్ల కోసం నిందితులు ఇందంతా చేయడం లేదని రూ. వేల కోట్లు దోచుకోవాలనే పెద్ద ప్లాన్ దీని వెనుక ఉందన్నారు. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత చెన్నై నుంచి నా స్నేహితుడు ఫోన్ చేశారని ఇక్కడ మేం చేయలేనిది అక్కడ మీరు చేశారని చెప్పారన్నారు.
Read More... ఐబొమ్మ రవిని పొగిడిన నటుడు శివాజీ.. దుమారం రేపుతున్న కామెంట్స్! (వీడియో)
వాడిది వాళ్ల అమ్మలాంటి క్రిమినల్ బ్రెయిన్.. మా వంశంలో అలాంటి వాళ్లే లేరు.. ఐబొమ్మ రవి తండ్రి






