- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT లవర్స్‌కు బిగ్ షాక్.. ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్
ఐ-బొమ్మ(I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు(CCS Police) అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐ-బొమ్మ(I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు(CCS Police) అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లూ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేసినట్లు నిర్ధారించారు.
కాగా, సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ-బొమ్మ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్‌లో అప్ లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐ-బొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్‌లో అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐ-బొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
అయితే.. ఈ కంప్లైంట్‌పై ఐ-బొమ్మ నిర్వహకుడు స్పందిస్తూ.. పోలీసులకే వార్నింగ్ఇచ్చాడు. ‘‘మీరు మాపై దృష్టి పెడితే.. మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’’ అని పోలీసులకు ఐ-బొమ్మ నిర్వహకుడు సవాల్ చేశారు. ఈ సవాల్‌పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. తప్పకుండా ఐ-బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హమీ ఇచ్చారు. తాజాగా ఐ-బొమ్మ నిర్వహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.






