- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
iBomma, BAPPAM వెబ్‌సైట్లు క్లోజ్.. రవితోనే మూసివేయించిన పోలీసులు
iBomma రవి హెచ్చరికను సవాల్ గా తీసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేయడమే కాక.. అతనితోనే వెబ్ సైట్ సర్వర్లను క్లోజ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: iBomma, BAPPAM మూవీ లవర్స్ లో ఈ వెబ్ సైట్లు తెలియని వారుండరు. థియేటర్, ఓటీటీల్లోకి విడుదలైన సినిమాను విడుదలైనట్లుగా క్షణాల్లో ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చాయి ఈ వెబ్ సైట్లు. వీటి నిర్వాహకుడైన ఇమ్మడి రవి.. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు ఓ కేసు విషయమై వచ్చి.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వెబ్ లాగిన్స్, సర్వర్ల వివరాలతో రవితోనే వాటిని మూసివేయించారు. అలాగే రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్ లను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతని బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను పరిశీలిస్తున్నారు. సోమవారం నాంపల్లికోర్టులో ఇమ్మడి రవి కస్టడీ పిటిషన్ వేసి.. కస్టడీకి కోరనున్నారు. ఈకేసులో అతని నుంచి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు విచారణ చేయనున్నారు.
దమ్ముంటే పట్టుకోండి.. నా వెబ్ సైట్ జోలికి వస్తే.. నా వద్ద ఉన్న కోట్ల మంది డేటాను లీక్ చేస్తా. ఈ వెబ్ సైట్ పై ఫోకస్ చేయడం ఆపండి అంటూ.. గతంలో ఇమ్మడి రవి పోలీస్ శాఖను హెచ్చరిస్తూ ఒక లేఖను విడుదల చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రవి హెచ్చరికను సవాల్ గా తీసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేయడమే కాక.. అతనితోనే వెబ్ సైట్ సర్వర్లను క్లోజ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.






