- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandamuri Balakrishna: సీఎం రేవంత్ రెడ్డికి నా కృతజ్ఞతలు: నందమూరి బాలకృష్ణ
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డుపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులపై (Gaddar Awards) టాలీవుడ్ యాక్టర్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును (NTR National Awards) ప్రకటించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవార్డు రావడం దైవ నిర్ణయంగా, తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదం అన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు, ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే ఈ అవార్డు రావడం నా అదృష్టం అన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్న చల్లిని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.






