- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: మంత్రి పదవికి నేను అర్హుడినే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంశం తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను (Telangana Congress) ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రావడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కెబినెట్ విస్తరణ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ అంశంలో ఢిల్లీ పెద్దలు పైనల్ నిర్ణయానికి రాకపోవడం రాష్ట్ర అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారుతోంది. ఈక్రమంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) అంశానికి ఎండ్ కార్డు పడబోతున్నది అనే ప్రచారం జోరందుకున్న వేళ తమకు కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రహస్య భేటీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దుమారం కొనసాగుతుండగానే తాజాగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (Raj Thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి నేను కూడా అర్హుడినేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన నేను మోస్ట్ బ్యాక్ వర్డ్ వర్గానికి చెందిన నేతననని పార్టీ లో అన్ని విభాగాలలో పనిచేశానన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా అడిగాని, నా మనసులో మాటను చాలా రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకెల్లానని చెప్పారు. దీంతో ఇప్పటికే కేబినెట్ లో చోటు కోసం టీ కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి.






