చిన్నారుల కష్టాలు చూడలేక రోడ్డెక్కిన హెడ్మాస్టర్.. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి హైడ్రా

by Gantepaka Srikanth |

సికింద్రాబాద్‌(Secunderabad)లోని మెట్టుగూడ డివిజ‌న్ చిల‌క‌ల‌గూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల(Government Primary School)కు బాట దొరికింది.

చిన్నారుల కష్టాలు చూడలేక రోడ్డెక్కిన హెడ్మాస్టర్.. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి హైడ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌(Secunderabad)లోని మెట్టుగూడ డివిజ‌న్ చిల‌క‌ల‌గూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల(Government Primary School)కు బాట దొరికింది. సోమ‌వారం జీహెచ్ఎంసీ(GHMC) జోన‌ల్ కార్యాల‌యం ఎదుట ప్రధానోపాధ్యాయుడు(Headmaster) మ‌ల్లికార్జున్ రెడ్డి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ‘మా బడికి బాట వేయండి సీఎం గారు’ అని నినదిస్తూ ధర్నా చేశారు. ఈ వార్త మీడియాలో ప్ర‌సారం అవ్వ‌డంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌తో ఇన్‌స్పెక్ట‌ర్ ఆదిత్య క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. ఆ పాఠ‌శాల‌కు వెళ్లే మార్గంలో అక్క‌డి నివాసితులు అడ్డంగా నిర్మించిన ప్ర‌హ‌రీని తొల‌గించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీ‌నివాస్‌తో పాటు సిబ్బంది కూడా ఉండి అడ్డు గోడ తొల‌గింపు ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌హ‌రీ తొల‌గించిన చోట వెంట‌నే గేటు ఏర్పాటు చేస్తామ‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వి కిర‌ణ్‌ చెప్పారు. ఇన్నాళ్లు బడికి వెళ్లే దారిలో గోడ అడ్డుగా ఉండటంతో సుమారు 100 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని హెడ్మాస్టర్ ఆవేదన చెందారు.

Next Story