- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్జా చేసినట్టు నిరూపణ అయితే పడే శిక్ష అదే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
హైడ్రా(Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కబ్జాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్క్‌లు కబ్జాచేస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) తరహాలో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని కీలక ప్రకటన చేశారు. హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో నేరుగా కేసులు నమోదు చేయబోరని.. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులను విచారణ చేస్తారని తెలిపారు. కబ్జా చేసినట్టు నిరూపణ అయితే తప్పకుండా జైలు శిక్ష పడుతుందని వెల్లడించారు. కాగా, ఇటీవలే హైడ్రా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాణిగంజ్‌లోని బుద్ధభవన్ పక్కనున్న జీ+2 భవనంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ఎస్‌హెచ్‌ఓగా ఏసీపీ పి.తిరుమల్ నియమితులయ్యారని, మరో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12మంది ఎస్సైలు, 30మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. ఆక్రమణదారులపై కేసు నమోదుచేసి, వేగవంతమైన విచారణతో సత్వర చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






