- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. కాపాడేందుకు హైడ్రా ప్రయత్నం
హైదరాబాద్ మహానగరంలో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో అక్రమాలపై హైడ్రా (HYDRAA) ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, అటవీ భూముల రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. అక్రమాలను తొలగిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో గాజులరామారంలో రూ. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ బందోబస్తుతో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కబ్జా దారుల నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి హైడ్రా విముక్తి కలిగించింది. కాగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కి కేటాయించిన ఈ భూమిని కాజేసేందుకు బడాబాబుల ప్లాన్ చేసి.. పేదల పేరు చెప్పి షెడ్లు వేయించారు. ఇది గమనించిన హైడ్రా ఆ షెడ్లను కూల్చివేసింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను హైడ్రా కొనసాగిస్తుంది.






