- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.13 కోట్ల విలువైన పార్కును కాపాడిన హైడ్రా
రూ.13 కోట్లు విలువ చేసే వెయ్యి గజాల పార్కును హైడ్రా అధికారులు కాపాడారు.

దిశ, వెబ్ డెస్క్: రూ.13 కోట్లు విలువ చేసే వెయ్యి గజాల పార్కును హైడ్రా అధికారులు కాపాడారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ విలేజ్‌లో వెయ్యి గజాల పార్కు కబ్జాకు గరైంది. సర్వే నంబర్ 23లో ఉషోదయ ఎన్ క్లేవ్ పేరుతో హుడా అనుమతి పొందిన లే ఔట్ లో పార్కు కోసం వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు జీహెచ్ ఎంసీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చింది. అయితే ఓ వ్యక్తి పార్కుకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పార్కు స్థలంగా నిర్ధారించి ప్రహరీని కూల్చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇక గతంలోనూ హైడ్రా అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా కబ్జాకు గురైన అనేక స్థలాలను కాపాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నగరంలోని చాలా చెరువుల్లో భూములు కబ్జా చేయగా వాటిలోని నిర్మాణాలను కూల్చివేసి కాపాడారు. దీంతో హైడ్రాపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు సైతం ఇస్తున్నారు.






