Hydra: 300 గజాలు కాదు, 1253 గజాలు.. మాజీ సైనికుడి ఫిర్యాదుతో వెలుగులోకి

by Ramesh Goud |   (  Updated:2025-02-06 11:45:19  IST  )

ప్రభుత్వ స్థలం కబ్జా (Government Land Encroachment)కు గురైంది 300 గజాలు కాదు.. 1253 గజాలు అని ఓ మాజీ సైనికుడి (former soldier) ఫిర్యాదు (complaint)తో వెలుగులోకి వచ్చింది.

Hydra: 300 గజాలు కాదు, 1253 గజాలు.. మాజీ సైనికుడి ఫిర్యాదుతో వెలుగులోకి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ స్థలం కబ్జా (Government Land Encroachment)కు గురైంది 300 గజాలు కాదు.. 1253 గజాలు అని ఓ మాజీ సైనికుడి (former soldier) ఫిర్యాదు (complaint)తో వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా(Hydra) కబ్జాకు గురైన స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ (Fence)ని తొలగింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి (Prajavani) నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు (complaints) స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులను పరిశీలించి హైడ్రా అధికారులు.. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పదవి విరమణ అనంతరం (after retirement) తనకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తలు కబ్జా (encroached) చేశారని ఓ మాజీ సైనికాధికారి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అది కూక‌ట్‌ప‌ల్లి- నిజాంపేట రోడ్డు (Kukatpally-Nizampet road)లోని హోలిస్టిక్ ఆసుప‌త్రి (Holistic Hospital) వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హైడ్రా అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ చేపట్టగా సంచలన విషయాలు (sensational facts) వెలుగులోకి వచ్చాయి. కబ్జాకు గురైనది 300 గజాలు కాదని, మొత్తం 1253 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు హైడ్రా తేల్చింది.

దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహ‌రీని బుధ‌వారం తొల‌గించారు. అలాగే మరికొన్ని ఫిర్యాదులపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారుల.. ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. 155 మీట‌ర్ల మేర ప్రహ‌రీ నిర్మించ‌డంతో స‌ర్వీసు రోడ్డు (service road)కు వెళ్లే దారి లేకుండా చేశార‌ని రాళ్లగూడ విలేజ్ (Rallaguda Village) ప‌రిస‌ర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా.. చర్యలు తీసుకున్నది. బుధవారం శంషాబాద్ మండ‌లం (Shamshabad Mandal) రాళ్లగూడ విలేజ్ వ‌ద్ద ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్డు (ORR service road)కు వెళ్లే దారి లేకుండా.. నిర్మించిన ప్రహ‌రీని తొల‌గించారు.

Next Story