Hydra: హైడ్రా సేవలకు అంతరాయం.. విధులు బహిష్కరించిన మార్షల్స్

by Prasad Jukanti |

హైడ్రా కంట్రోల్‌ రూమ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Hydra: హైడ్రా సేవలకు అంతరాయం.. విధులు బహిష్కరించిన మార్షల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజధానిలో హైడ్రా ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం జీతాలు తగ్గించడంపై మార్షల్స్ (Hydra marshals) విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలతోపాటు ట్రైనింగ్, ప్రజావాణి సేవలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. కాగా మాజీ సైనిక ఉద్యోగులు హైడ్రాలో మార్షల్స్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 100మంది వరకు ఉన్న వీరిని 2020లో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌‌లోకి విధుల్లోకి తీసుకోగా ప్రస్తుతం హైడ్రాలో ఉన్నారు. జీతాల తగ్గింపు అంశంపై కమిషనర్ రంగనాథ్‌తో (Ranganath) మాట్లాడుతామని తెలిపారు. దీనిపై గతవారంగా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు సిటీని వర్షాలు ముంచెత్తుతున్న వేళ హైడ్రా మార్షల్స్ ఆందోళన బాట పట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story