Hydra: హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. గ్రామాల్లో వెల్‌కమ్ హైడ్రా బ్యానర్లు

by Ramesh Goud |

ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే ద్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా(Hydra)కు ప్రజల మద్దతు(Support) పెరుగుతోంది.

Hydra: హైడ్రాకు పెరుగుతున్న మద్దతు.. గ్రామాల్లో వెల్‌కమ్ హైడ్రా బ్యానర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే ద్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా(Hydra)కు ప్రజల మద్దతు(Support) పెరుగుతోంది. హైడ్రాకు స్వాగతం(Welcome Hydra) అంటూ.. గ్రామాల్లో పోస్టర్లు(Posters) వెలుస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) లోని ఆక్రమణలకు గురైన చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) హైడ్రాను తీసుకొచ్చింది. ప్రభుత్వం హైడ్రా పని తీరును మెచ్చి.. దాని పరిధిని మరింత విస్తరించింది. అంతేగాక హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) హైడ్రా కార్యాలయంలో(Hydra Office) ప్రజా వాణి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.

దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై ఉక్కు పాదం మోపుతున్న కమిషనర్ రంగనాథ్.. హైడ్రా బృందాన్ని పంపి, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కొర్రెముల(Korremula) గ్రామంలో ఓ భూ సమస్యను హైడ్రా పరిష్కరించింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. వెల్‌కమ్ హైడ్రా అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ లో హైడ్రాను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ధన్యావాదాలు తెలిపారు. అంతేగాక దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించి, గడీల సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించడానికి విచ్చేయుచున్న హైడ్రా కమిషనర్, వారి బృందానికి కొర్రెముల గ్రామ ప్రజలు హృదయపూర్వక ఆహ్వానం పలికారు. ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story