- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ,తెలంగాణ బ్యూరో : ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఒక్కో ఫిర్యాదును ప్రాధాన్యతక్రమంలో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలించారు. పటాన్ చెరు ప్రాంతంలో ప్రణీత్ కౌంటీకి ఆనుకుని వెళ్తున్న నక్కవాగు నాలా కబ్జాను పరిశీలించారు. నాలా వెడల్పు బఫర్ జోన్ తో కలిపి 36 మీటర్లుండాల్సి ఉండగా సగం వరకు కబ్జా చేసినట్టు గుర్తించారు. నిర్మాణ అనుమతులు మంజూరుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు నాలా వెడల్పు లేని పక్షంలో ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. మసీదు బండ ప్రాంతంలోని జంగంకుంట తనదిగా చెప్పుకొని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో కమిషనర్ పరిశీలించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు. ఇప్పటికే అక్కడ ఇల్లు కట్టుకున్న వారు ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఇకపై కబ్జా జరగకుండా చూస్తామన్నారు. హైడ్రా పేరిట ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే హైడ్రా దృష్టికి తీసుకు రావాలని స్థానికులకు సూచించారు.
అనంతరం గచ్చిబౌలి లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్ ను పరిశీలించారు. లే ఔట్ రహదారులు, పార్కులను మొత్తం చెరిపేసి అక్కడ కన్వెన్షన్ల పేరిట వ్యాపారత్మకంగా వాడుకున్న తీరును పరిశీలించారు. నెక్నంపూర్లో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద రోడ్డు కు అడ్డంగా ప్రహరీ నిర్మించి దారిని బంద్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదును కమిషనర్ పరిశీలించారు. నెక్నంపూర్ లే ఔట్ లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా ఫిర్యాదును తనిఖీ చేశారు. గండిపేట మండలం నెక్నంపూర్ సర్వే నెంబర్ 20 లో ప్రభుత్వ భూమి కబ్జాను పరిశీలించారు. అనంతరం గండిపేట చెరువును సందర్శించారు. ఖానాపూర్, నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వారా గండిపేట చెరువులో కలుస్తున్నదనే ఫిర్యాదును పరిశీలించారు. పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు , రిసార్టుల నుంచి మురుగు నీరు కలవ కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీరు కలవకుండా నిర్మాణాలు చేపట్టి డైవర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
- Tags
- Hydra






