- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల కాలుష్యంపై ‘హైడ్రా’ ఫోకస్.. వ్యర్థ జలాలు రాకుండా కఠిన చర్యలు
హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి విచ్చిలవిడిగా మురుగు పారుదలకు ముకుతాడు వేయనుంది. భారీ భవనాలకు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లేకపోతే చర్యలు తీసుకోనుంది. చెరువుల కాలుష్యానికి కారణమైన నిర్మాణ సంస్థలపై చర్యలు ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నది. అందులో భాగంగానే సున్నంచెరువును పునరుద్ధరణకు నడుంకట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు హైడ్రా అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
చెరువుల కాలుష్యం
ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల కాలుష్యంపై హైడ్రా దృష్టి సారించింది. చెరువులను ఆక్రమించి లేక్ వ్యూ పేరుతో వ్యాపారాలు చేస్తున్న బడా నిర్మాణ సంస్థలు తమ బహుళ అంతస్తుల భవనాల మురుగునీటిని యథేచ్ఛగా జలవనరుల్లోకి వదిలేస్తున్నాయి. కోమటికుంట, మైసమ్మ చెరువు, ఐడీఎల్ చెరువు, అంబీర్, ఖాజాగూడ చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బులిటీ(సీఎస్ఆర్) పేరుతో అభివృద్ధి చేస్తామని తీసుకున్న సంస్థలే కాలుష్యకారకాలుగా మారుస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్మాణదారులు బహుళ అంతస్తులకు ఎస్టీపీలు నిర్మించాలని నిబంధనల్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. చెరువుల్లోకి వస్తున్న మురుగును సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా చెరువుల్లో నింపుతున్న తీరు, చెరువుల పునరుద్ధరణకు బృహత్ బెంగళూర్ మహానగర పాలిక(బీబీఎంపీ) అనుసరిస్తున్న విధానాలను హైడ్రా అధికారులను అధ్యయనం చేశారు. ఈ విధానాన్ని నగరంలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
సున్నం చెరువుకు మొదటి ప్రాధాన్యం
మాదాపూర్ లోని సున్నం చెరువు కాలుష్యకారకంగా మారింది. మరింత ప్రమాదకరంగా మారింది. మాదాపూర్ లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్ పల్లిలోని నల్లచెరువు, ఉప్పల్ లోని నల్లచెరువు, అంబర్ పేట్ లోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్ నుద్దౌలా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి మండలాల సరిహద్దులోని గుట్టలబేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య సున్నంచెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి.. తాగునీరు నిలిచేలా సుమారు రూ.10కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది.






