సికింద్రాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. హర్షం వ్యక్తం చేసిన పరిసర ప్రాంతాల ప్రజలు

by Kema Shiva Kumar |

అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా ఏర్పడిన ‘హైడ్రా’ దూకుడుగా ముందుకు వెళ్తోంది.

సికింద్రాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. హర్షం వ్యక్తం చేసిన పరిసర ప్రాంతాల ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా ఏర్పడిన ‘హైడ్రా’ దూకుడుగా ముందుకు వెళ్తోంది. రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని పునరుద్ధరించడమే ధ్యేయంగా కార్యాచరణను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ పరిధిలోని బెగం‌పేట్, ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతాల్లోని కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. నాలా విస్తీర్ణం పూర్తిగా కుచించుకుకోవడంతో వర్షం వస్తే వరద నీరు కాలనీలోని ఇళ్లల్లోకి వస్తుందని స్థానికులు ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ నాలాను పరిశీలించి నాలాలపై ఉన్న ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఉదయం రంగంలోకి దిగిన సిబ్బంది నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో నెలమట్టం చేయగా.. పలు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story