- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసారి బతుకమ్మ పండగ అక్కడే.. హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టత
‘యాకుత్ పుర ఘటన విషయంలో హైడ్రాను బ్లేమ్ చేశారు. ఇది బ్లేమ్ గేమ్ కాదు. అయితే హైడ్రా సిబ్బందేనని గుర్తించాం. భవిష్యత్‌లో సమన్వయంతో ముందుకెళ్తాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘యాకుత్ పుర ఘటన విషయంలో హైడ్రాను బ్లేమ్ చేశారు. ఇది బ్లేమ్ గేమ్ కాదు. అయితే హైడ్రా సిబ్బందేనని గుర్తించాం. భవిష్యత్‌లో సమన్వయంతో ముందుకెళ్తాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శుక్రరవారం హైడ్రా ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులెవరని అందరూ కన్ఫ్యూషన్‌లో ఉన్నారని, కానీ హైడ్రా వల్లే తప్పు జరిగిందని గుర్తించామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన హైడ్రా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘పాతబస్తీలోని యాకుత్‌పురా డివిజన్ మౌలాకా చిల్లాలోని మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం విధితమే. ఈ ఘటనలో డీఆర్ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరు, మెట్ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) సిబ్బంది ఇద్దరి నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్ధారించుకుంది. డీఆర్ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికీ డిమోషన్ యిచ్చింది. మెట్ సిబ్బందికి చెందిన ఇద్దరినీ తొలగించాలని మెట్ టీమ్ కాంట్రాక్టర్ ను ఆదేశించింది’ అని కమిషనర్ తెలిపారు.
సమన్వయంతో ముందుకు..
పాతబస్తీలోని మ్యాన్ హోల్ తెరచిన తర్వాత మూయకుండా వదిలేయడం పట్ల హైడ్రా బాధ్యత వహిస్తున్నట్టు కమిషనర్ ఏవీ.రంగనాథ్ ప్రకటించారు. ఈ ఘటను తీవ్రంగా పరిగణించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటుకు ఆస్కారం లేకుండా శుక్రవారం అధికారులందరినీ సమావేశపరిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో అధికారులందరినీ అప్రమత్తం చేశారు. నగరంలో అన్ని క్యాచ్‌పిట్లపైనా మ్యాన్ హోల్ మూతలుండేలా చూడాలన్నారు. ఒక వేళ ఎక్కడైనా లేకుంటే.. సంబంధిత శాఖలైన జీ హెచ్ ఎంసీ, జలమండలి అధికారులతో సంప్రదించి వాటిపై మూతలు వేసేలా చర్యలు తీసుకోమని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఒక వేళ ఎక్కడైనా పొరపాటున మ్యాన్ హోల్ మూత తెరచి ఉంటే.. ఆ సమాచారాన్ని 9000113667 నంబరుకు ఫోను ద్వారా తెలియజేయాలని నగర ప్రజలను కోరారు.
ఇతర శాఖలతో ఇబ్బంది లేదు..
ఇతర శాఖలతో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు లేవన్నారు. జీహెచ్ఎంసీ పెద్ద ఆర్గనైజేషన్, హైడ్రా ఎవరిపై పెత్తనం చెలాయించట్లేదన్నారు. అన్ని విభాగాలకు బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారని, మాకు శాంక్షన్ అయిన బడ్జెట్ లో ఒక క్వార్టర్ ది మాత్రమే రిలీజ్ అయిందని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లో త్వరలో కేసులు నమోదు చేస్తామన్నారు. సున్నం చెరువులో పనులు ఆపమని కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ లేదన్నారు. బతుకమ్మ కుంట పనులు పూర్తవబోతున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తామని చెప్పారు. ఈసారి బతుకమ్మ పండగ అక్కడ జరిగేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.






