- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15 రోజులే.. ఎక్కువ టైమ్ తీసుకోం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ హామీ
హైదరాబాద్‌లోని బుద్ధ భవన్(Buddha Bhavan)లో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) ప్రజావాణి ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బుద్ధ భవన్(Buddha Bhavan)లో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) ప్రజావాణి ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనూహ్యంగా ఈ సోమవారం బాధితులు ఫిర్యాదులతో భారీ ఎత్తున హైడ్రా ఆఫీస్‌కు వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నేరుగా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి కబ్జాదారుల ఆగడాలపై సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్(Ranganath) మాట్లాడుతూ.. ఎక్కువ టైమ్ తీసుకోమని.. 15 రోజుల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
మరోవైపు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధిలో ఇవాళ హైడ్రా(Hydra) అధికారులు రంగంలోకి దిగారు. సంపత్ నగర్‌లో వెంచర్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని, అదేవిధంగా ఊట్ పల్లిలో 40 ఫీట్ల రోడ్డు ఆక్రమించి గేటు ఏర్పాటు చేశాడని కొన్ని రోజుల క్రితం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు సోమవారం ఉదయమే అక్కడకు వెళ్లి అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఎవరికీ భయపడొద్దని భూములు, పార్కులు, సీలింగ్ భూములు, చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా హైడ్రా కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు సూచించారు. అనుమతి లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలు తప్పమన్నారు. ప్లాట్లు భూములు ఎవరు కొనుగోలు చేసిన వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించే కొనుగోలు చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాయమాటలకు మోసపోయి ప్రభుత్వ భూములు, కుంటలు కొని మోసపోవద్దు అన్నారు.






