రిటైర్డ్... కానీ డ్యూటీలోనే..! జరీనా పర్వీన్ పై నిప్పులు చెరిగిన బీజేపీ

by Bhanu |

పదవీ విరమణ పొందిన తర్వాత కూడా తెలంగాణ స్టేట్ ఆర్చీవ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సేవలు కొనసాగిస్తున్న డైరెక్టర్ జరీనా పర్వీన్, అసిస్టెంట్ డైరెక్టర్ అఖిబ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న వెంకట రమణ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రిటైర్డ్... కానీ డ్యూటీలోనే..! జరీనా పర్వీన్ పై నిప్పులు చెరిగిన బీజేపీ
X

దిశ, చార్మినార్ : పదవీ విరమణ పొందిన తర్వాత కూడా తెలంగాణ స్టేట్ ఆర్చీవ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సేవలు కొనసాగిస్తున్న డైరెక్టర్ జరీనా పర్వీన్, అసిస్టెంట్ డైరెక్టర్ అఖిబ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు పొన్న వెంకట రమణ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో జరీనా పదవీ విరమణ అనంతరం గత 8 ఏళ్లుగా మజ్లీస్ నేతల ప్రోత్సాహంతో అనధికారికంగా ఉద్యోగినిగా కొనసాగుతున్నారని తెలిపారు.


ఇటీవల వక్ఫ్ బోర్డ్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థనపై పలు గోప్యమైన డాక్యుమెంట్లు — గజిట్ నోటిఫికేషన్‌లు, ముంత కాపీలు, 1952–56 మధ్యకాలం నాటి దస్తావేజులు.. లీక్ చేసినట్టు ఆరోపించారు. ఈ చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ, ఆమెపై విజిలెన్స్ విచారణ ప్రారంభించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి సంబంధిత శాఖలను జరీనా పర్వీన్‌పై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పొన్న వెంకట రమణ తెలిపారు.


Next Story