- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేఈఈ మెయిన్స్ లో ర్యాంక్ రాలేదని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది.

దిశ, హిమాయత్ నగర్ : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ యూ. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా బాల్య తండాకు కు చెందిన దారవత్ రాందాస్ కుమారుడు దారవత్ ప్రవీణ్ కుమార్ (20) నారాయణగూడ లోని అభ్యశ్రీ బాయ్స్ హాస్టల్ లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కు ఢిల్లీ కు చెందిన ఓ ఇనిస్టిట్యూట్ ఆన్లైన్ క్లాస్ లలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
కాగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రవీణ్ కుమార్ క్వాలిఫై కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈనెల 12న తల్లిదండ్రులకు చివరిగా ప్రవీణ్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడాడు. 13న తల్లిదండ్రులు ప్రవీణ్ కు ఫోన్ చేయగా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీనితో వారు బుధవారం ఉదయం హాస్టల్ కు వచ్చి చూడగా, ప్రవీణ్ కుమార్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ యూ చంద్రశేఖర్ తెలిపారు.






