- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి ఆత్మహత్య... యువకుడి బ్లాక్ మెయిల్ తట్టుకోలేక
ఓ ఆన్లైన్ పరిచయం యువతి నిండు ప్రాణం తీసింది. ఓ యువకుడి బ్లాక్‌మెయిలింగ్ కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది యువతి.

దిశ, వనస్థలిపురం: ఓ ఆన్లైన్ పరిచయం యువతి నిండు ప్రాణం తీసింది. ఓ యువకుడి బ్లాక్‌మెయిలింగ్ కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది యువతి. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీలో నివాసముండే బాణోతు నందు (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వనస్థలిపురం సీఐ మహేశ్‌గౌడ్ వివరాల ప్రకారం.. ఈశ్వరమ్మ కాంప్లెక్స్‌లో నివాసముండే బాణోతు అచ్చమ్మ, చిన్న మున్నయ్య రెండో కూతురు నందు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నందు.. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసే సమయంలో.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్లా నాయక్ తండాకు చెందిన ధరావత్ వినీత్ పరిచయమయ్యాడు. ఆ తరువాత తరుచూ ఫోన్లు , మెసేజ్‌లు చేస్తూ, అప్పుడప్పుడు బలవంతగా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించమని వేధించేవాడు. డబ్బులు పంపకపోతే చాటింగ్ లిస్ట్ బయట పెడతానని బెదిరించేవాడు వినీత్. వేధింపులు ఎక్కువ కావడంతో..బాణోతు నందు సూసైడ్ చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించామని సీఐ తెలిపారు.






