- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. సీనియర్ ప్రొఫెసర్ సారా నహీద్ కు సన్మానం
ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీనియర్ ప్రొఫెసర్ సారా నహీద్ ను ఘనంగా సన్మానించనున్నట్లు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ తెలిపారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో : ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీనియర్ ప్రొఫెసర్ సారా నహీద్ ను ఘనంగా సన్మానించనున్నట్లు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ హాజరవుతున్నారన్నారు. ప్రొఫెసర్ సారా నహీద్ గత 34 సంవత్సరాలుగా వృక్షశాస్త్రంలో అనేక శిబిరాలు, సదస్సులు, పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటే కార్యక్రమం, విద్య, పరిశోధన రంగాలలో అపారమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల డైరెక్టర్ గా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ప్రొఫెసర్ సారా నహీద్ జాతీయ , అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించారని, తెలంగాణ విశ్వవిద్యాలయానికి, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోకి ఆమె ఒక వనరుల నిపుణు రాలిగా కూడా ఉన్నారని వెల్లడించారు. ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ సన్మానాన్ని చేస్తున్నట్లు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ వెల్లడించారు.






