Rain Alert : వాహనదారులకు అలర్ట్.. వర్షానికి బండి ఆగిపోతే వెంటనే ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి

by Malleboina Mahesh |   (  Updated:2023-07-27 08:15:42  IST  )

హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ట్రాఫిక్‌లో నరకయాతన పడుతున్నారు.

Rain Alert : వాహనదారులకు అలర్ట్.. వర్షానికి బండి ఆగిపోతే వెంటనే ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ట్రాఫిక్‌లో నరకయాతన పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా నడిరోడ్డుపై వాహనాలు మొరాయించి ట్రాఫిక్ జామ్ సమస్యలు పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నంబరును తీసుకవచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా రహదారిపై వాహనం నిలిచిపోతే వాహనదారులు 83339 93360 ప్రత్యేక వాట్సప్ నంబరుకు సంప్రదించాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం సంప్రదించేందుకు మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ 87126 63011, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ 87126 63010 నంబర్‌లను విడుదల చేశారు. 9490617346 సైబరాబాద్ పోలీసులు మరో వాట్సప్ నంబరు‌ను ప్రకటించారు.

Next Story