- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMWSSB: హైదారాబాదీలకు అలర్ట్.. పలుచోట్ల 18 గంటలు మంచినీటి సరఫరా బంద్..!
హైదరాబాద్‌లో పలుచోట్ల 18 గంటల వరకు మంచినీటి సరఫరా నిలిపివేయనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ (Hyderabad) పరిధిలో పలుచోట్ల 18 గంటల వరకు మంచినీటి సరఫరా (water supply) నిలిపివేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు (NH–44) నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పనుల భాగంగా, ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఉన్న జలమండలి కి చెందిన 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపడుతోంది. ఈ నేపథ్యంలో, మారేడ్ పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఉన్న ఎంఎస్ పైప్‌లైన్‌ను కొత్తగా వేసిన పైప్‌లైన్‌తో స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేయడానికి హెచ్ఎండీఏ జంక్షన్ పనులను చేపడుతోంది.
ఈ పనులు తేదీలు ఈ నెల 27, సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 18 గంటల వరకు కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని (HMWSSB) హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదారాబాదీలను అలర్ట్ చేశారు. వివరాల కోసం క్లిక్ చేయండి..
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..
1. నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాసనగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
2. భోలక్ పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి ప్రాంతాలు.
3. హస్మత్‌పేట్, ఫీరోజ్‌గూడ, గౌతమ్‌నగర్ ప్రాంతాలు.
4. బల్క్ వినియోగదారులు: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ (SCR), మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (MES), బేగంపేట్ విమానాశ్రయం.
5. బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి, AOC రైల్వే కాలనీ (SCB పరిధిలోని ప్రాంతాలు).






