- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది.

దిశ, వనస్థలిపురం: గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. హయత్నగర్సీఐ నాగరాజు గౌడ్ వివరాల ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు నర్సరీ– గౌరెల్లి రోడ్డు పక్కన వేప చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సెక్టార్ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. సుమారుగా 45 ఏండ్లు ఉన్న వ్యక్తి టవల్ తో ఉరి వేసుకొని ఉన్నాడు. మృతుడు ఎరుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు నెక్కర్ వేసుకొని ఉన్నాడని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. ఎవరికైనా మృతుడి ఆచూకీ తెలిస్తే ఎస్సై లక్ష్మీనారాయణ ను 8712662286 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






