- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
450 సీసీ కెమెరాల నిఘా నీడలో..
18వ టాటా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ నేపధ్యంలో రాచకొండ పోలీసులు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు పటిష్ట బందోబస్తు స్కీమ్ ను రూపొందించారు.

దిశ, సిటీక్రైం :18వ టాటా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ నేపధ్యంలో రాచకొండ పోలీసులు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు పటిష్ట బందోబస్తు స్కీమ్ ను రూపొందించారు. ఈ నేపధ్యంలో పోలీసు కమిషనర్ సుధీర్ బాబు,సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులు, హైదరాబాద్ కిక్రెట్ అసోసియేషన్ సభ్యులు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర ప్రతినిధులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలతో ప్రతి కదలికలను గమనించే విధంగా చర్యలు తీసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. లాప్ టాప్ లు, అగ్గిపెట్టేలు, పదునైన వస్తువులు, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బయటి నుంచి తినుబండారాలను అనుమతించడం లేదని సీసీ స్పష్టం చేశారు. మార్చి 23 నుంచి మే 21 వరకు జరిగే టోర్నమెంట్ లో మొత్తం 9 మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నట్లు సీపీ వివరించారు.
ఈ మ్యాచ్ ల సందర్భంగా సాధారణ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉప్పల్ స్టేడియం మార్గంలో ట్రాఫిక్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేయాలని సీపీ సూచించారు. స్టేడియం లోపల కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలను అమ్మే వారందరీకి ఒకే డ్రెస్సు కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీ స్టేడియం ప్రతినిధులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు సిబ్బందిని మొహరిస్తునట్లు సీపీ తెలిపారు. పార్కింగ్ సమస్య ఉండకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మల్కాజిగిరి పద్మజ, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ స్పెషల్ బ్రాంచి నరసింహారెడ్డి, డీసీపీ ఎస్ఓటీ రమణరెడ్డి, డీసీపీ కార్ హెడ్ క్వార్టర్స్ శ్యాంసుందర్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఐపీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More..
Tatikonda Rajaiah : రేవంత్ పాలన అట్టర్ ప్లాప్ : తాటికొండ రాజయ్య






