- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA : హైడ్రా పేరుతో బెదిరింపులు... ఇద్దరి అరెస్ట్
హైడ్రా(HYDRA) పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRA) పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్‌షిప్(Alkapuri Township)లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ వద్ద హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన మిరియాల వేదాంతం యెలిశెట్టి శోభన్‌బాబులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. నిందితులు హైడ్రా అధికారులమని చెప్పుకొని, అపార్ట్‌మెంట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులను బెదిరించి డబ్బు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా, నిందితులను అదుపులోకి తీసుకుంది.
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. తమ పేరును దుర్వినియోగం చేస్తూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే 87124 06899 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే హైడ్రా పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.






