- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలకలగూడ హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
సికింద్రాబాద్ లోని మెట్టుగూడ బొందలగడ్డ ప్రాంతంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చిలుకలగూడ పోలీసులు.

దిశ, సీతాఫలమండి : సికింద్రాబాద్ లోని మెట్టుగూడ బొందలగడ్డ ప్రాంతంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చిలుకలగూడ పోలీసులు. కుక్కల విషయంలో ఏర్పడిన చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసి, చివరకు హత్యాప్రయత్నంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు సుంకిపాక బాల వంశీ (24) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. మరో నిందితుడు బొజ్జ భాగ్యరాజ్ అలియాస్ భాగ్య (28) రౌడిషీటర్. సికింద్రాబాద్ చిలకలగూడలో నివాసం ఉంటాడు.
వీరిద్దరు కలిసి అందె శంకర్ కుమారుడు అనీల్ కుమార్ (27) ని కత్తి, వెదురు కర్రలతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అనిల్ కుమార్ కి తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ కేసును చిలకలగూడ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద ఘటనలో ఉపయోగించిన కత్తి, రెండు వెదురు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.






