చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు రిమాండ్.

by Disha Web Desk 11 |
చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు రిమాండ్.
X

దిశ, చంపాపేట్ : చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఐ.ఎస్. సదన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9.9 గ్రాముల బంగారం, ఒక హోండా యాక్టివా, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకట్ రామయ్య తెలిపిన వివరాలు ప్రకారం... ఇబ్రహీంపట్నం మన్నెగూడ ప్రాంతానికి చెందిన డ్యాన్సర్ గారాల ప్రసాద్ గౌడ్ అలియాస్ డాన్సర్ ప్రసాద్ (24), బాలాపూర్ మల్లాపూర్ ప్రాంతానికి చెందిన వాడిత్యావత్ గణేష్ (21)లు డాన్సర్లు. ఈ నెల 16వ తేదీన ఐ.ఎస్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగతనానికి పాల్పడిన ప్రసాద్ గౌడ్, వి.గణేష్ లను శనివారం సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంచన్ బాగ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 9.9 గ్రాముల బంగారం, ఒక హోండా యాక్టివా, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు.



Next Story

Most Viewed