శుభకార్యాల్లో అసభ్యత మానుకోవాలి: టిపిఎస్కే హెచ్చరిక

by Bhanu |

శుభకార్యాల్లో అసభ్య ప్రవర్తన, అపశ్రుతులు, అనుచిత మాటలతో ప్రజల మనోభావాలు దెబ్బతీయడం మానుకోవాలని ట్రాన్స్‌జెండర్ పీపుల్స్ అసోసియేషన్ (టిపిఎస్కే) హెచ్చరించింది.

శుభకార్యాల్లో అసభ్యత మానుకోవాలి: టిపిఎస్కే హెచ్చరిక
X

దిశ, రాంనగర్: శుభకార్యాల్లో అసభ్య ప్రవర్తన, అపశ్రుతులు, అనుచిత మాటలతో ప్రజల మనోభావాలు దెబ్బతీయడం మానుకోవాలని ట్రాన్స్‌జెండర్ పీపుల్స్ అసోసియేషన్ (టిపిఎస్కే) హెచ్చరించింది. బాగ్ లింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హిజ్రా నాయకురాలు మోనాలిసా, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త రచన ముద్రబోయిన తదితరులు ఈ విషయంపై స్పందించారు.

కొన్ని హిజ్రాల గ్రూపులు శుభకార్యాల్లో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తించడం, శాపనార్థాలు పెట్టడం, నగ్నంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంతో సమాజంలో హిజ్రా సముదాయంపై దారుణమైన దృక్పథం ఏర్పడిందన్నారు. ఈ తీరును వెంటనే మానుకోవాలని తెలంగాణ హిజ్రా గురువుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ .. ‘‘ఇళ్లూ ఉపాధి లేని పరిస్థితుల్లో హిజ్రాల పట్ల సమాజం ఇంకా అవగాహనతో కాదు. అడుక్కోవడం లేదా వ్యభిచారమే మా జీవితం అన్నట్టు సమాజం చూస్తోంది. మేం కూడా మనుషులమే, మమ్మల్ని అంగీకరించండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అసభ్య ప్రవర్తనతో హిజ్రా సంస్కృతి దిగజారకుండా చూడాల్సిన బాధ్యత హిజ్రా సమాజానిదని, అందరూ మరిచిపోలేని స్థితిలో సమాజంలో జీవించాలన్నదే తమ ఆశయమని టిపిఎస్కే పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆర్. జాస్మిన్, జి. గంగ, సోనీ, అనిత తదితరులు పాల్గొన్నారు.

Next Story